FbTelugu

అసభ్య ప్రవర్తనపై విచారణకు మంత్రి ఆదేశం

నెల్లూరు: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) లో మెడికల్ విద్యార్థిపై అసభ్య ప్రవర్తన వ్యవహారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.

నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో మెడికల్ విద్యార్థిపై అసభ్య ప్రవర్తన ఘటనపై మంత్రి ఆళ్ల నాని సత్వరమే స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులను సూచించారు. నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో వికృత పర్వం అంటూ మీడియా లో వచ్చిన కథనాలపై ఆయన విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిఎంఈ డాక్టర్ మానుకొండ రాఘవేంద్ర రావు ను అదేశించారు. నెల్లూరు ఏసిఎస్ఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, ఇద్దరు ప్రొఫెసర్ల తో విచారణకు అదేశించారు. ఈరోజు సాయంత్రంకు ఈ ఘటనకు సంబందించిన పూర్తి నివేదిక ఇవ్వాలని డిఎంఈ డాక్టర్ రాఘవేంద్ర రావు ను మంత్రి నాని అదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.