FbTelugu

చిడతల నాయుడ్ని నమ్ముకుంటే అంతే!: మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: చిడతల నాయుడ్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఎద్దేవా చేశారు. జనాల్లోకి రావడం, ధర్నాలు చేయడం చిడతల నాయుడు(కొణిదెల పవన్ కళ్యాణ్)కు వ్యాపారం అయిపోయిందని విమర్శించారు.
సహస్రకోటి నాయుడుల్లో పవన్ ఒక బోడి నాయుడు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడం చిడతల నాయుడికే చెల్లిందన్నారు. ఇవాళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని వెంకట్రామయ్య మీడియాతో మాట్లాడారు. 2014లో హైటెక్స్‌లో మీటింగ్ పెట్టి చిడతలు ఎవరికి కొట్టారు? చెప్పాలన్నారు. నేను తుది శ్వాస వరకూ వైయస్‌ఆర్‌ కుటుంబానికే విధేయుడిగా ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు.

సీఎం సాబ్‌కి చెప్పండి అంటారా? అసలు పవన్ లా ఎప్పుడు చదివారు?. పంట నష్టం జరిగిన సీజన్‌లోనే పరిహారం అందడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని అన్నారు. నివర్‌ తుపాను పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జగన్ జమ చేశారన్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యమూ కొన్నామన్నారు. మీరు బలపర్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు మేము అధికారంలోకి రాగానే తీర్చామన్నారు. చంద్రబాబు హయాంలో ఎగ్గొట్టిన రూ.960 కోట్ల విత్తన బకాయిలు చెల్లించామని మంత్రి నాని వివరించారు.
18 నెలల్లో రైతుల కోసం జగన్ సర్కార్‌ రూ.61,400 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఉచిత విద్యుత్, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కౌలు రైతులతో పాటు అసైన్‌మెంట్, అటవీ భూములు సాగుచేస్తున్న రైతులకూ రైతు భరోసా అందిస్తున్నామని పేర్ని నాని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.