FbTelugu

మంత్రిని బలితీసుకున్న కరోనా

లక్నో: నిన్నటి వరకు కరోనా వైరస్ తో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మృతి చెందగా తాజాగా రాష్ట్ర మంత్రి చనిపోయారు. కరోనా వైరస్ యూపీ సాంకేతిక విద్యాశాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ (62) ని కబలించింది.
గత నెల 18న అనారోగ్యం బారిన పడడంతో ఆమై వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారు. కోలుకున్నట్లు కన్పించినప్పటికీ ఆదివారం ఉదయం ఆరోగ్యం మరింతగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో వెంటిలేటర్ పై ఉన్న కమల్ రాణి మృతి చెందారు. ఈ విషయాన్ని వైద్యులు మధ్యాహ్నం ప్రకటించారు.

రెండు సార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన కమల్ రాణి మొన్న జరిగిన ఎన్నికల్లో కాన్పూర్ జిల్లాలోని ఘటంపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం యోగి ఆదిత్యానాథ్ క్యాబినెట్ లో మంత్రిగా చేరారు. ఆమె మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి విచారం వ్యక్తం చేశారు.

You might also like