FbTelugu

సారాలో సోడా కలిపే మంత్రి జగదీష్ రెడ్డి: రేవంత్

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో మంత్రి జి.జగదీష్ రెడ్డి నిన్న తన స్థాయిని మర్చి బజారు రౌడీలా వ్యవహరించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి విమర్శించారు.

జగదీష్ రెడ్డి జాగ్రత్తగా ఉండండి… అడ్డగోలుగా మాట్లాడితే పడేవారు ఎవ్వరూ లేరని ఆయ హెచ్చరించారు. మంత్రి జగదీష్ రెడ్డికి సమాధానం చెప్పడానికి ఏమిలేక ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. జగదీష్ రెడ్డి కుస్తీలు పట్టాలని ఉంటే గ్రౌండ్ చెప్తే కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారన్నారు.

గాంధీ భవన్ లో ఇవాళ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగదీష్ రెడ్డి కి సారాలో సోడా కలపడం తప్ప ఏమీ తెలియదని, ఆయనకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందో అందరికి తెలుసు అన్నారు. నీళ్లు-నిధులు-నియామకాలు అనే ఎజెండాతో ఉద్యమంలో పాల్గొన్న పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెతిన ఎగిరించిన వ్యక్తులు ఆచార్య జయశంకర్, ప్రొ. కోదండరామ్, విద్యార్థులు, కళాకారులన్నారు. ఉద్యమం ఉదృతంగా సాగిందంటే ఆర్టీసీ-సింగరేణి-విద్యార్థుల కృషేనన్నారు.

తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు…

తెలంగాణ నీళ్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతే-నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఘోరంగా అవమానిస్తున్నదన్నారు.

ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పై కేసులు ఇంకా తొలగించలేదు కానీ కేసీఆర్ కుటుంబం పై ఉన్న కేసులను ప్రత్యేక టీమ్ లను పెట్టి కేసులు కొట్టేయించుకున్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా ఉద్యమకారుల పై కేసులు తొలగించకపోవడాన్ని చూస్తే ఉద్యమకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మర్యాద ఇస్తుందో అర్థం అవుతుంది.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ ని మర్చిపోయేలా చేశారు. బంగారు ముద్ద అయిన కోదండరామ్ ఇల్లును అర్థరాత్రి పోలీసులు ముట్టడించారు. ప్రజా కవులు-కళాకారులు-ఉద్యమ నేతల పై సొంత రాష్ట్రంలో నిర్బంధం కొనసాగుతోందని రేవంత్ ఆరోపించారు.

పాలమూరు, ఎస్ఎల్ బీసీ ఎక్కడికి పోయాయి…

విలువలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం అవుతుంది అనుకుంటే… నిర్బంధ తెలంగాణగా ప్రపంచానికి కన్పిస్తోందన్నారు. ఉచిత విద్య- దళిత గిరిజన రిజర్వేషన్లు-డబుల్ బెడ్ ఇండ్లు-మూడెకరాల భూమి-నీటి ప్రాజెక్టులు ఎక్కడ పోయాయి? అని ఆయన నిలదీశారు. రూ. 1లక్ష 20వేల కోట్లు ప్రాజెక్టుల పై నిధులు ఖర్చు చేస్తే, పాలమూరు-ఎస్ఎల్ బీసీ లాంటి ప్రాజెక్టులు ఎటు పోయాయి? అని ప్రశ్నించారు.

మిషన్ కాకతీయ నాలుగో విడుత ఎక్కడికి పోయింది?- ఆరేళ్ల లో ఎన్ని చెరువులు మిషన్ కాకతీయ పునరుద్ధరణ చేశారు?. హైదరాబాద్ అభివృద్ధి-నిరుద్యోగ భృతి-రుణమాఫీ ఎందుకు పూర్తి స్థాయిలో అందడం లేదో చెప్పాలన్నారు. వికలాంగులకు 3శాతం రిజర్వేషన్లు సొంత రాష్ట్రంలో ఇస్తా అన్న కేసీఆర్ ఎందుకు మర్చిపోయారో తెలపాలి. ఎస్టీ-ఎస్సి సబ్ ప్లాన్ కాంగ్రెస్ తెస్తే తుంగలో తొక్కింది నిజం కాదా?. కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచ్ వా? లేదా తెలంగాణ రాష్ట్రానికి సీఎం వా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నేతలకు యూనివర్సిటీలు…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు పూర్తి అయినా అంబేద్కర్ విగ్రహం ఏమైంది, కనీసం పునాది రాయి కూడా వెయ్యలేదు. దళిత బిడ్డ, ఎమ్మెల్యే టీ.రాజయ్య పై అవినీతి ఆరోపణలు వచ్చాయని బర్తరఫ్ చేసి ఇప్పటి వరకు ఎందుకు ఆరోపణలు నిరూపించలేదు ఎందుకు?. ప్రజలు తిరస్కరించినా సిగ్గు లేకుండా బిడ్డ, కుటుంబ సభ్యులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదా?. వ్యాపారం కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలకు యూనివర్సిటీ లను కట్టబెట్టలేదా?. కేజీ టు పీజీ ఉచిత విద్యా అంటే సొంత పార్టీ నేతలకు యూనివర్సిటీలు కట్టబెట్టడమా?. ఉద్యమంలో చెప్పిన నీళ్లు-నిధులు-నియామకాలు—ఎన్నికల్లో చెప్పిన హామీలు ఎక్కడ పోయాయన్నారు.

కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాత్రమే చెప్తాడు. కేసీఆర్ కొండ పోచమ్మ దగ్గర స్టార్ట్ చేస్తే ఐదు పంప్ హౌస్ లలో ఒక్కటే నడిచింది. కేసీఆర్ ఎత్తిపోసింది 50 టీఎంసీలు అయితే 50లక్షల టన్నుల పంట ఎట్లా పండిందో చెప్పాలి?. కేసీఆర్ తను చేసిన పాపాలను సరిదిద్దుకోవదానికి రెండో సారి అవకాశం దేవుడు ఇచ్చాడు. కేసీఆర్, హరీష్ రావు సెక్యూరిటీ లేకుండా సింగరేణి, బస్ భవన్ దగ్గరకు రాగలరా? అన లేవనెత్తారు.

వెలమ కులం వాళ్లకే పదవులు…

20 ఏళ్ల కింద రిటైర్మెంట్ అయిన కేసీఆర్ తన కులం వ్యక్తులకు కీలక పదవులు కట్టబెట్టారు. త్వరలోనే కేసీఆర్ తన బంధువులకు ఇచ్చిన పోస్టుల లిస్ట్ విడుదల చేస్తానన్నారు. ఎన్నో నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే, ఇవ్వాళ ఎవరి పాలు అయిందో తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు తెలంగాణ ప్రజల కోసమేనన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.