FbTelugu

100శాతం ప్రైవేటీకరిస్తాం: మంత్రి నిర్మల

న్యూఢిల్లీ: మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగాల కల్పన కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు నూటికి నూరు శాతం ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్లమెంటులో మంత్రి నిర్మల స్పష్టతనిచ్చారు. ప్లాంట్ వ్యవహారంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు లోకసభలో లిఖిత పూర్వకంగా ఆమె సమాధానం ఇచ్చారు. స్టీలు ప్లాంట్ లో రాష్ట్రానికి ఎటువంటి ఈక్విటీ షేర్ లేదన్నారు. వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని నిర్ణయం చేశామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.