FbTelugu

కేసీఆర్ ప్రధాని అయితే సమస్యలు ఉఫ్: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాన మంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి అన్నారు. కెసిఆర్ ఒక్కసారి అయినా ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు.

ఇవాళ అసెంబ్లీలో మల్లారెడ్డి కార్మిక శాఖ పద్దుపై మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధంగానే కెసిఆర్ దేశాన్ని కూడా ఊహించని విధంగా అభివృద్ధి చేస్తారన్నారు. కెసిఆర్ నాయకత్వంలో దేశ చరిత్రే మారిపోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కార్మిక సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యం చేశాయన్నారు. ప్రైవేటీకరణ పేరుతో కార్మికుల పొట్టలు కొట్టే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.