FbTelugu

నలుగురు ఎమ్మెల్యేలు, ఒక మంత్రికి ట్వీట్ తలనొప్పి!

హైదరాబాద్: ఈటల రాజేందర్ తరువాత వేటు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పై పడుతుందనే కథనం ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. ఈ కథనంపై మల్కాజగిరి ఎంపి ఎ.రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రసకందాయంలో హంపి ధూమ్ ధామ్… కోవర్ట్ క్రాంతి కిరణాలతో కకావికలం… యముడు జగదీశ్ రెడ్డి ఘంటా కొట్టినట్టేనా…? అంటూ రేవంత్ ట్వీట్ మొదలు పెట్టారు. అయితే ఈ ట్వీట్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చంటి క్రాంతికిరణ్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, జగదీశ్ రెడ్డి ని ఉద్ధేశించినట్లుగా ఉన్నాయి. వీరితో పాటు ఈ పార్టీలో ఇటీవలే దిగిపోయిన ఒక ఛైర్మన్ ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

టిఆర్ఎస్ పార్టీలో మరో సంచలనానికి వేదిక కాబోతుంది అనడానికి ఈ ట్వీట్ సూచిస్తున్నదని అంటున్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో కర్ణాటక రాష్ట్రం హంపిలోని ఖరీదైన రిసార్టులో తన కుమారుడి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఛైర్మన్, ముఖ్య నాయకులు హాజరయ్యారు. జన్మదిన వేడుకలు అయినా టిఆర్ఎస్ పార్టీ భవితవ్యం, ఈటల రాజేందర్ వ్యవహారం, కెటిఆర్ ముఖ్యమంత్రి పదవి ఆశపై చర్చించినట్లు వార్తాకథనంలో రాసుకొచ్చారు. ఈ కథనం పై రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.