FbTelugu

సర్కార్ దవాఖానలో కొరత లేదు: మంత్రి ఈటల

కరీంనగర్: రాష్ట్రంలోని సర్కార్ దవాఖానల్లో రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసులు, పరిస్థితులపై పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించామన్నారు.

తుమ్మనపల్లిలో ఇవాళ మంత్రి రాజేందర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నైట్ కర్ఫ్యూ విధించడం మూలంగా కేసు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేశారు. గ్రామాలకు కరోనా విస్తరిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. వ్యాక్సిన్ వేసే కేంద్రాలను పెంచామని, అవసరమైతే మరిన్ని పెంచుతామన్నారు. తెలంగాణ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ను కోరామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.