FbTelugu

మంత్రి రాసలీలల సీడీ ప్రకంపనలు!

బెంగళూరు: రాష్ట్రంలో ఒక మంత్రి రాసలీల సీడీ ప్రకంపనలు సృష్టిస్తున్నది. మంత్రి, మహిళకు సంబంధించిన సీడీని ఒక వ్యక్తి బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ కు అందచేసి, రక్షణ కల్పించాలని కోరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఉద్యోగం కల్పిస్తానని చెప్పిన కర్ణాటక రాష్ట్ర మంత్రి ఒకరు తనతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని ఒక మహిళ ఆరోపించింది. మంత్రి తనతో గడిపిన సందర్భాలను ఆమె రహస్య కెమెరాతో చిత్రీకరించింది. మంత్రి తనకు ఉద్యోగం కల్పించకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధిత మహిళ ఈ వీడియో సీడీని సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్‌ కల్లహళ్లికి చేరవేసింది. ఇంకేముంది ఆ వీడియో బాహ్యప్రపంచంలో చక్కర్లు కొడుతున్నది. రాసలీలల మంత్రిపై చర్యలు తీసుకోవాలని, తనకు, బాధిత మహిళకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన బెంగళూరు పోలీసు కమిషనర్‌ కమల్‌పంత్‌ను మంగళవారం సాయంత్రం కలిసి కోరారు.

ఇదే సీడీని కొన్ని టీవీ ఛానళ్లకు కూడా పంపించిన దినేశ్ కన్పించకుండా పోయారు. ఈ ఘటనపై సంబంధిత మంత్రి స్పందించారు. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోని వస్తాయని, కేసును ఎదుర్కొంటానని, వెనుకంజ వేయబోనని ఆయన స్పష్టం చేశారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, విచారణకు సహకరించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు మంగళవారం రాత్రి బెంగళూరులో భారీ ఎత్తున ధర్నా చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.