తిరుపతి: కరోనా పాజిటివ్ తో ఆకాల మరణం చెందిన సీవీఆర్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ పార్థసారథి కుటుంబానికి పంచాయతి రాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందచేశారు.
రెండు దశాబ్దాల పాటు మీడియా లో కెమెరా మెన్ గా పనిచేసిన పార్థసారథి మృతి చెందడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు. ఆయన కుటుంబానికి వైయస్సార్ సీపీ ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. విధి నిర్వహణ లో జర్నలిస్టులు అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మరింత అప్రమత్తం గా ఉండాలని ఆయన సూచించారు.