FbTelugu

అసమాన్యుడు సున్నం రాజయ్య: హరీష్ రావు

హైదరాబాద్: సీపీఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి చెందడంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అత్యంత గౌరవించే, సున్నం రాజయ్య గారి మరణం తీవ్రదుఃఖాన్ని కలిగించింది.

పేదప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు, దళితుల గొంతుగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసమాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకుడు’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like