FbTelugu

ఇకనుంచి పూర్తి జీతాలు: మంత్రి హరీశ్ హామీ

హైదరాబాద్: జూన్ నెల నుండి ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు అంగీకారం తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన ప్రతినిధులు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు ను ఇవాళ ఆయన నివాసంలో కలిశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అందరికీ జూన్ నెల మాసం నుండి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారు.

అదేవిధంగా వేతన బకాయిలకు సంబంధించి జీపీఎఫ్ లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే సీపీఎస్, పెన్షనర్లకు ఇన్ స్టాల్ మెంట్ లో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామని మంత్రి చెప్పారు. వేతన బకాయిలు కూడా జీపీఎఫ్ లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని ఐక్యవేదిక పక్షాన కోరారు.

You might also like