FbTelugu

క్లబ్‌లు నిర్వహించాల్సిన గతిపట్టలేదు: కొడాలి

* వాటిపై రైడ్ చేయించింది మా ప్రభుత్వమే
అమరావతి: తనకు పేకాట క్లబ్‌లు నిర్వహించాల్సిన గతి పట్టలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని/ (వెంకటేశ్వరరావు) అన్నారు. ఓ పేకాట క్లబ్ వైసీపీ మంత్రి కనుసన్నల్లోనే నడుస్తోందంటూ.. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు దీటుగా కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేకాట క్లబ్ లపై బతికిన చరిత్ర చంద్రబాబు, దేవినేని ఉమాలదేనని అన్నారు. పేకాట క్లబ్ లపై కఠిన చట్టాలు చేస్తూ సీఎం జగన్ నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

తామే పేకాట క్లబ్ లు నిర్వహిస్తే పోలీసులెలా రైడ్లు చేస్తారని ప్రశ్నించారు. ఆ రైడ్ చేయించింది తామ ప్రభుత్వమేనని అన్నారు. ఈ విషయంలో కొన్ని పత్రికలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం దాడులు చేయమంటేనే పోలీసులు పేకాట క్లబ్బులపై దాడులు చేశారని వెల్లడించారు. ఒకవేళ పేకాట ఆడుతూ దొరికిపోయిన వాళ్లలో తన అనుచరులు ఉన్నా, తన తమ్ముడే ఉన్నా ఇబ్బందేమీలేదని, వాళ్లకేమైనా ఉరిశిక్ష వేస్తారా? అని అన్నారు. వాళ్ల కోసం తాను సీఎం జగన్ వద్దకు పరిగెత్తుకు రావాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. పట్టుకుంటే జరిమానా కట్టించుకుని వదిలేస్తుంటారు కాబట్టే హద్దు అదుపు లేకుండా పేకాట ఆడుకుంటుంటారన్నారు. పోలీసులు ఎవర్ని పట్టుకున్నారు, ఏ పార్టీ వారిని పట్టుకున్నారు, పేకాట ఆడుకునేవారికి పార్టీ ఏమిటి.. ? లేకపోతే ఒకే కులం వారు ఆడుకుంటున్నారా? ఏ కులం అయినా, ఏ పార్టీ వారు అయినా.. ఎవరుంటే వారిని అరెస్ట్ చేసి డబ్బును, వెహికల్స్‌ను సీజ్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతోందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.