FbTelugu

వెంటిలేటర్ పై మంత్రి చౌహాన్

హైదరాబాద్: భారత పాతతరం క్రికెటర్, యూపీ మంత్రి చేతన్ చౌహాన్ ఆరోగ్యం విషమంగా ఉంది. కరోనా వైరస్ సోకడంతో ఆయన గత నెలలో ఆయన ఆసుపత్రిలో చేరారు.
గురుగ్రామ్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో వెంటిలేటర్ ఏర్పాటు చేశారు.

గత నెల 12 లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ హాస్పటల్ లో చేర్చారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అక్కడి నుంచి గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో చేతన్ చౌహాన్ మంత్రిగా పనిచేస్తున్నారు.

You might also like