FbTelugu

విశాఖకు ఏ క్షణంలోనైనా రాజధాని: మంత్రి సత్తిబాబు

రాజమహేంద్రవరం: ఏ క్షణంలో నైనా సరే అమరావతి నుంచి విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని తరలిస్తామని ఏపి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడు రాజధానులను టీడీపీ అడ్డుకుంటున్నదని, హైకోర్టుకు వాస్తవాలు వివరిస్తామని ఆయన అన్నారు. ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే అభివృద్ధి చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కోల్పోయారని ఆయన ధ్వజమెత్తారు. త్వరలోనే రాష్ట్రంలో 32 మున్సిపాల్టీలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. విలీనం అయిన గ్రామాలతోనే రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయన్నారు. కొత్తగా ఎన్నికలైన నగర మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లకు మార్చి 31వ తేదీన వర్క్ షాపు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వైసీపీ ఘన విజయం సాధించిందని బొత్స సత్యానారాయణ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.