FbTelugu

తిరుపతిలో వైసిపి విజయం తథ్యం: మంత్రి అనిల్

నెల్లూరు: పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో లక్షల మెజార్టీతో వైసిపి విజయం సాధిస్తుందని సాగునీటి శాఖ మంత్రి అనిల్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మాజీ సిఎం ఎన్.చంద్రబాబు సొంత జిల్లాలోనే టిడిపికి దిక్కులేదన్నారు.
తిరుపతి ఉపఎన్నికలో టిడిపి, బిజేపి, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని, టిడిపి, బిజేపిలు మత రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండి పడ్డారు.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేసి 24 గంటలైనా టిడిపి స్పందించలేదన్నారు. సిఎం జగన్ సభ పెడితే లక్షలాది మంది జనం తరలి వస్తారని, ప్రజారోగ్యం దృష్ట్యా తిరుపతి సభను జగన్ రద్దు చేసుకున్నారన్నారు. వ్యక్తిగత సిబ్బందికి కరోనా వస్తేనే జనసేన అదినేత కొణిదెల పవన్ లోపలకు వెళ్లిపోయారన్నారు. పవన్ చేసింది మాత్రం టిడిపికి కరెక్ట్ గా కనిపిస్తోందా?అని ప్రశ్నించారు. పెద్ద రెమ్యూనేషన్ తీసుకుని కూడా టెకెట్ల ధర పెంచుకుని అభిమానులను దోచుకోవడం కరెక్టా?. టికెట్ల ధర పెంచాలనడం బ్లాక్ మార్కెట్ కాదా?. తిరుపతిలో వైసిపి విజయం ఎప్పుడో ఖాయమైందన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు దమ్ముంటే తన ఎమ్మెల్యేలు, ఎంపిలతో రాజీనామా చేయించాలన్నారు. తప్పుడు పనులు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుపై కూడా కేసులు పెట్టామని మంత్రి అనిల్ యాదవ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.