FbTelugu

తెలంగాణ నీటిని వినియోగించం: మంత్రి అనిల్

అమరావతి: ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ నీటిని వినియోగించమని ఏపీ భారీ నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు హాని కలిగించే పనులను ముఖ్యమంత్రి జగన్ చేపట్టరని తెలిపారు.

కేటాయించిన వాటాల ప్రకారమే నీటి వినియోగం ఉంటుందని తెలిపారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నీటి వినియోగాన్ని పర్యవేక్షిస్తుందని అన్నారు. కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి కూడా వరద నీటిని మళ్లించుకోవడం కోసమేనని అన్నారు. తమకు కేటాయించిన 512 టీఎంసీల నీటికే కట్టుబడి ఉన్నామని తెలిపారు.

You might also like