FbTelugu

బీసీలపై బాబుది నక్కజిత్తులు ప్రేమ: మంత్రి అనిల్

అమరావతి: తప్పులు చేస్తే కులం,మతం అంటకట్ట వచ్చా… నేరాలు చేసినవారిని అరెస్టు చేస్తే తప్పా అని నీటి పారుదల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు.

బీసీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను స్పష్టమైన ఆధారాలతో అరెస్టు చేశారు. హత్య చేసిన వ్యక్తి బీసీ కాదా…భాస్కర్ రావు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడలేదా అన్నారు. కొల్లు రవీంద్ర తప్పు చేయకపోతే గోడ దూకి ఎందుకు పారిపోయాడో చెప్పాలన్నారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాటలు చూస్తుంటే కౌరవుల సభ గుర్తుకు వస్తోందన్నారు. ఒక మహిళా ఎంపీడీఓ పైన అసభ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్ధిస్తాడా అని విమర్శించారు. రూ.150కోట్లు దోచిన మాజీ మంత్రి  అచ్చెన్నాయుడి అరెస్టు చేస్తే కూడా బీసీ కులం వాడతారా అని అనిల్ ప్రశ్నించారు. బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంది చంద్రబాబేనన్నారు.

రాష్ట్రంలో 30లక్షల మందికి ఇళ్లు ఇస్తుంటే… కోర్టుకు వెళ్లి దాన్ని కూడా అడ్డుకుంటున్నారు. అ30లక్షల లబ్దిదారుల్లో 22లక్షల మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ లబ్దిదారులు వున్నారన్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.