FbTelugu

రాష్ట్రంలో మైనింగ్ మాఫియా: ఎంపీ అరవింద్

హైదరాబాద్: రాష్ట్రంలో మైనింగ్ మాఫియా నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్  ఆరోపించారు. తెలంగాణలో పింక్ యాక్ట్ అమలవుతోందని, మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జాతీయ సంపద అయిన ఖనిజ వనరులను కార్పొరేట్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మై హోమ్ కంపెనీలను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీజయ జ్యోతి 2013లో తమ యాజమాన్యాన్ని మైహోమ్ కు మారిందని స్పష్టం చేసిందన్నారు. అయితే మై హోమ్ వాళ్ళు శ్రీజయ జ్యోతితో తమకు సంబంధం లేదని బుకాయిస్తున్నారన్నారు.

మై హోమ్ సంస్థలో 2008 నుంచి 2019 వరకు విదేశీ పెట్టుబడుల ఉల్లంఘనలు జరిగాయన్నారు. మైనింగ్ చట్టం సవరణ, బెదిరింపులు, జాతీయ సంపద విదేశాలకు తరలించడం వంటి అక్రమాలకు ఈ సంస్థ పాల్పడిందన్నారు. వేలాది కోట్ల రూపాయలు అడ్డంగా దోచుకుంటున్నా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడం లేదన్నారు.

గాయత్రి గ్రానైట్ యజమాని రవిచంద్రకు 2017 లో రూ.10 కోట్ల అపరాధ రుసుం విధించారని, టీఆర్ఎస్ లో చేరగానే మాఫీ చేశారన్నారు.

You might also like