FbTelugu

ఇక పోస్ట్ ఆఫీసుల్లోనూ ‘మినిమమ్’ బాదుడు

* డిసెంబర్ 11 నుంచి పోస్ట్ ఆఫీస్ కొత్త రూల్స్
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అమలు చేస్తున్న కొన్ని రూల్స్ ఇక పోస్టాఫీసుల్లోనూ అమలు కాబోతున్నాయి. డిసెంబర్ 11 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

డిసెంబర్ 11 నుంచి ఖాతాదారులు కచ్చితంగా అకౌంట్‌లో మినిమమ్ రూ.500 కలిగి ఉండాలి. లేనిఎడల మెయింటెనెన్స్ చార్జీలు కట్టాల్సి వస్తుంది. పోస్టాఫీస్ ఇప్పటికే సేవింగ్స్ కలిగిన వారికి ఈ విషయాన్ని తెలియజేసింది. ఒకవేళ అకౌంట్‌లో అసలు డబ్బులు లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై 4 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు ఆర్ధిక సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా లావాదేవీ నిర్వహించి ఉండాలి. లేని ఎడల అకౌంట్ క్లోజ్ అవుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.