FbTelugu

టిక్ టాక్ కోసం ఇళ్లు వీడిన మైనర్లు

గుంటూరు: తూర్పుగోదావరిలో తీవ్రకలకలం సృష్టించిన ఐదుగురు బాలల మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మామిడి కుదురు మండలానికి చెందిన ఆ ఐదుగురు బాలలను పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరిలో అదుపులోకి తీసుకున్నారు.

అయితే టిక్ టాక్ మోజులో వీడియోలు తీసుకోవడం కోసమే వారు అక్కడికి వచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. వారి తల్లిదండ్రులు వచ్చాక కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పంపించనున్నట్టు తెలిపారు.

You might also like