FbTelugu

మోదీ, అమిత్ షా తో చేతులు కలపలేదు: అసద్

కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్ర అమిత్ షా లతో కుమ్మక్కయ్యానన్నది అవాస్తవమని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.

కర్నూలు పాత నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. గుజరాత్‌ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని, అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తున్నామని ఆయన అన్నారు, ప్రతి రాష్ట్రంలో కనీసం 5-6 సీట్లు తక్కువ కాకుండా గెలుస్తున్నామని ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. గత సాధారణ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తమ మద్దతు తీసుకున్నారని.. ఇప్పుడు మాత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని మున్సిపల్ ప్రచారానికి వెళితే అక్కడ కూడా అనుమతి లభించలేదని అన్నారు. జగన్ రెడ్డి సెక్యులర్ నాయకుడు కావడం, తండ్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నామని అసుదుద్దీన్ వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.