FbTelugu

కౌంటింగ్ కేంద్రంలో ఎంఐఎం నేత అరెస్టు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఎంఐఎం నాయకుడు తన వెంట అనుమతి లేకుండా మొబైల్ ఫోను తీసుకువెళ్లాడు. బుటు సాక్స్ లో మొబైల్ తీసుకువెళ్లారనే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి ఎంఐఎం నాయకుడిని అరెస్టు చేశారు. యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో ఎర్రగడ్డ డివిజన్ కౌంటింగ్ జరుగుతోంది. ఈ కేంద్రంలోకి ఎంఐఎం అభ్యర్థి షాహినా బేగం భర్త, మాజీ కార్పొరేటర్ షరీఫుద్దీన్ వెళ్లాడు. నిషేధిత ప్రాంతంలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, ఆ ఫోటోలు ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఇంకేముంది అతన్ని కౌంటింగ్ హాలు నుంచి బయటకు లాక్కొచ్చి, జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.