FbTelugu

పోలీసులను బెదిరిస్తున్న ఎంఐఎం కార్పొరేటర్

హైదరాబాద్: మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో చావని లో లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసు విధులను ఎంఐఎం కార్పొరేటర్ మూర్తుజా అలీ, అనుచరులు అడ్డుకున్నారు.

వీడియో తీస్తూ కానిస్టేబుళ్లను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా  యూనిఫామ్ బ్యాచ్ ను చిత్రీకరించి క్రమంలో కానిస్టేబుళ్లను పరుష పదజాలంతో దూషించారు. హిందూ దేవాలయాల వద్ద వెళ్లి డ్యూటీ చేసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పై ఆఫీసర్ వచ్చే వరకు కదిలేది లేదంటూ హెచ్చరించారు.

సామాన్య ప్రజలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసు శాఖ ఈ కార్పొరేటర్, అతని అనుచరుల జులుంపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

You might also like