FbTelugu

యూపిలో 100 సీట్లలో ఎంఐఎం పోటీ: అసదుద్దీన్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నెలలో జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఎంఐఎం అధినేత, ఎం.పి అసదుద్దీన్ ఓవైసి ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో వంద సీట్లలో పోటీచేసి తమ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు.
ఇప్పటికే తమకు బలం, బలగం ఉన్న చోట అభ్యర్థుల వడపోత కార్యక్రమం ప్రారంభమైందన్నారు.

తాము ఓం ప్రకాశ్ రాజ్ భర్ నేతృత్వంలోని సంకల్ప్ మోర్చాతో పొత్తు పెట్టుకున్నామని అసదుద్దీన్ వివరించారు. ఇతర పార్టీలతో పొత్తు ఉండదని, రెండు పార్టీల నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరారు అవుతారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బి.ఎస్.పి అధినేత కుమారి మాయావతి ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఎంఐఎం అధినేత పోటీపై తన నిర్ణయాన్ని వెల్లడించారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు యుపిలో పోటీ చేశారు. ఎంఐఎం పోటీ చేయడం మూలంగా రాహుల్ గాంధీ ఓటమిపాలయ్యారు. ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోటీ చేయవద్దని రాహుల్ గాంధీ కోరినప్పటికీ అసదుద్దీన్ ఏమాత్రం పట్టించుకోకుండా బరిలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.