FbTelugu

ఆమె పాటకు మూడు రోజుల్లో మిలియన్ల వ్యూస్

పొగరు సినిమాలోని అరే ఎవర్రా ఈ గులాబ్ జామూన్… ఏయ్ తెల్వదా అన్న గర్ల్ ఫ్రెండ్ బే… అనే సంభాషణలో షురూ అవుతూ కరాబు అంటూ సాగే వీడియో సాంగ్ కు యూ ట్యూబ్ లో మిలియన్ల కొద్దీ చూస్తున్నారు.

కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా, ధృవ సార్జా నటిస్తున్న పొగరు సినిమా కు నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి వీడియో సాంగ్ ను మూడు రోజుల క్రితం విడదల చేశారు. ఆగస్టు 6న విడుదలైన ఈ సాంగ్ కు 9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 1.25 లక్షల మంది లైక్ చేశారు. ఈ పాట అటు క్లాస్ ఇటు మాస్ ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ధనంజయ్, సంపత్ రాజ్, పవిత్ర లోకేష్, రవి శంకర్, గిరిజా లోకేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్ కై గ్రీనే, మోర్గాన్ ఆస్టే, జాన్ లుకాస్, జోయ్ లిండర్ లు కూడా నటిస్తున్నారు.

You might also like