FbTelugu

సైబర్ మోసం… యువతికి లక్షల టోకరా

హైదరాబాద్: పెళ్లి చేసుకునేందుకు ఒక యువతి తన వివరాలను ఒక మాట్రిమోని సైట్ లో వివరాలు నమోదు చేసుకున్నది. ఆ వివరాలు చూసిన సైబర్ కేటుగాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడు విడతల్లో లక్షలు కాజేశాడు.
ఈ కేసుకు సంబించి సైబర్ క్రైమ్స్ ఏసిపి కెవిఎం.ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన అనితా రాజ్ వరుడి కోసం భారత్ మాట్రిమోని లో వివరాలు అప్ లోడ్ చేసింది. ఆ వివరాలను చూసిన ఒక సైబర్ కేటుగాడు తన పేరు బక్షి క్లిఫర్డ్ అని, తనది పంజాబ్ రాష్ట్రమని తెలిపాడు. స్కాట్లాండ్ లో వైద్యుడిగా పని చేస్తున్నానని చెప్పి పరిచయం చేసుకున్నాడు.

కొద్ది రోజులు మాటలు సాగిన తరువాత, పెళ్లి చేసుకుని స్కాట్లాండ్ లో సెటిల్ అవుదామని ప్రతిపాదన పెట్టాడు. అనిత కూడా అంగీకారం తెలపడంతో ప్రేమకు గుర్తుగా ఖరీదైన గిఫ్ట్ పంపిస్తున్నట్లు తెలిపాడు. రెండు మూడు రోజుల తరువాత హైదరాబాద్ కస్టమ్స్ అధికారులం ఫోన్ చేస్తున్నామని చెప్పి మూడు దఫాలుగా రూ.9 లక్షలు కొల్లగొట్టాడు. కస్టమ్స్ అధికారులం అని గొంతు మార్చి మాట్లాడినా అనిత గమనించలేకపోయింది. డబ్బులు ట్రాన్స్ ఫర్ అయిన తరువా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తను మోసపోయానని గమనించిన అనిత శనివారం ఆన్ లైన్ లో సైబర్ క్రైమ్స్ కు ఫిర్యాదు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.