FbTelugu

కార్మికులను స్వస్థలాలకు పంపాలి: హైకోర్టు

అమరావతి: వలస కార్మికులపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని, వారిని ఆదుకునేందుకు నగదు, ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వలస కార్మికుల సమస్యలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రభుత్వం, పిటీషనర్ తరఫు వాదనలు విచారించింది. విచారణ తరువాత శనివారం తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతోనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని రామకృష్ణ ఆకాంక్షించారు. వలస కార్మికులను ఆదుకుని, వారికి ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

You might also like