FbTelugu

ఐఐటీ లో వలస కూలీల ఆందోళన

సంగారెడ్డి: తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటూ.. కంది ఐఐటీ ఆవరణలో  (ఎల్అండ్ టీ కంపెనీ) వలస కూలీలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆపే ప్రయత్నం చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన వలస కూలీలు పోలీసులపై కూడా ఎదురు దాడికి దిగారు. అక్కడి చేరుకున్న పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు. కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనం ధ్వంసమైంది.

తమను ఎవరూ ఆదుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ తో ఇక్కడ ఉండలేక పోతున్నామని, ఆకలితో అలమటిస్తున్నామని తమ బాధను వెలిబుచ్చారు.

You might also like