FbTelugu

మిగ్-29 కే శకలాలు గుర్తింపు

పనాజీ: కొన్ని రోజుల క్రితం అరేబియా సముద్రంలో ప్రమాదవశాత్తూ కూలిపోయిన మిగ్-29కే యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలను ఇండియన్ నేవీ తాజాగా గుర్తించింది. గత గురువారం ఈ మిగ్-29కే ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌక నుంచి గాల్లోకి ఎగిసిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాలతో సముద్రంలో కుప్పకూలింది.

ఈ ఘటనలో ఓ పైలెట్ ను సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడగా, మరో పైలెట్ కమాండర్ నిషాంత్ సింగ్ కోసం ఆచూకీ లభించలేదు. కూలిపోయిన మిగ్-29కే విమానం కోసం గోవా తీర ప్రాంతంలో తొమ్మిది యుద్ధనౌకలు, 14 విమానాలు గాలించగా.. తాజాగా కొన్ని శకలాలను గుర్తించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.