FbTelugu

మైక్రోసాఫ్ట్ దానికే రిటైర్మెంట్ ప్రకటించింది

న్యూయార్క్: గూగుల్ క్రోమ్, ఆపిల్ సఫారా బ్రౌజర్ కు నెటిజన్లు మొగ్గుచూడంతో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ ఫోర్లరర్ బ్రౌజర్ ను చూసేవారు లేకుండాపోయారు. ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ కు  బొత్తిగా మార్కెట్ లేకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

పాతిక సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ బ్రౌజర్ ను సృష్టించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయకపోవడం, పోటీ సంస్థలను తట్టుకోలేక పోవడంతో ఎక్స్ ఫ్లోరర్ కు ఆదరణ తగ్గింది. ఇక నుంచి విండోస్ 10 నుంచి ఎక్స్ ఫ్లోరర్ బదులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటుదని తెలిపింది. ఇది చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుందని, భద్రతా ప్రమాణాలు కూడా ఎక్కువని, ఎక్స్ ఫ్లోరర్ తో పోల్చితే సూపర్ గా ఉంటుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎక్స్ ఫ్లోరర్ కు రిప్ సందేశాలు, కామెంట్లు పెడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జూన్ 15వ తేదీ 2022 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ బ్రౌజర్ సెలవు తీసుకుంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఆ తరువాత నుంచి ఎలాంటి సాంకేతిక మద్దతు లభించదు. అయితే ఎక్స్ ఫ్లోరర్ ఆధారంగా పనిచేస్తున్న పోర్టళ్లు, యాప్ లు మాత్రం ఎడ్జ్ బ్రౌజర్ తో 2029 వరకు పనిచేస్తాయని తెలిపింది. ప్రస్తుత మార్కెట్ లో 3.39 శాతం వాటానే ఎడ్జ్ బ్రౌజర్ కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ నిర్ణయంపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.