FbTelugu

మైక్రోసాఫ్ట్ చైర్మన్ నాదేళ్ల సత్య

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా నాదేళ్ల సత్య అలియాస్ సత్యనారాయణ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనను బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వెల్లడించింది.
సత్య ఇప్పటి వరకు సిఈఓ గా వ్యవహరిస్తూ మైక్రోసాఫ్ట్ అభివృద్ధిలోల కీలక పాత్ర పోషించారు. చైర్మన్ గా ఉన్న జాన్ డబ్ల్యూ థామ్సన్ ను స్వతంత్ర డైరెక్టర్ గా నియమించారు. న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, లింక్డ్ ఇన్, జెనిమాక్స్ లాంటి కొనుగోళ్లు సంస్థను పురోభివృద్ధి చేశారు.

ఆయన సిఈఓ గా వచ్చాక అనేక మార్పులు తీసుకువచ్చారు. క్లౌడ్ కంప్యూటింగ్ పై విస్తృతంగా పనిచేయడంతో మొబైల్ రంగంపై పట్టు సాధించడంలో సఫలీకృతం అయ్యారు. ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదేళ్ల యుగంధర్, సంస్కృతి లెక్చరర్ ప్రభావతి దంపతులకు 1967 లో సత్యనారాయణ జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో ప్రాథమిక విద్యను, కర్ణాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబిఏ పట్టా తీసుకున్న ఆయన 1992లో సన్ మైక్రో సిస్టమ్ లో చేరారు. మైక్రో సాఫ్ట్ లో అంచెలంచెలుగా ఎదిగి ఛైర్మన్ స్థాయికి చేరుకున్నారు. స్టార్ బక్స్ లో డైరెక్టర్ గా, ఫ్రెడ్ హచిసన్ క్యాన్సర్ రీసెర్చి సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ట్రస్టీగా కొనసాగుతున్నారు. తన తండ్రి యుగంధర్ బ్యాచ్ మెట్ అధికారి కుమార్తె అనుపను సత్య వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం వీరు వాషింగ్టన్ లో నివాసం ఉంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.