FbTelugu

స్వదేశీ పిట్ట ‘‘కూ’’ లో భారీగా పెట్టుబడులు

న్యూఢిల్లీ: విదేశీ సోషల్ మీడియా సంస్థలకు మూకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలు స్వదేశీ సోషల్ మీడియా సంస్థలకు కలిసి వస్తుందనే చెప్పాలి. ట్విటర్, ఫేస్ బుక్, వాట్సప్ సంస్థలపై ఎప్పటికైనా వేటు తప్పదని గ్రహించిన కొందరు స్వదేశీ సాంకేతికతో యాప్ లు అభివృద్ధి చేశారు.
ఆ కోవలోనిదే కూ యాప్. భారతీయ భాషలలో అభిప్రాయాలను పంచుకునేందుకు మైక్రో బ్లాగింగ్ కూ యాప్ వచ్చేసింది. కేవలం ఒక సంవత్సర కాలంలోనే 6 మిలియన్ల డౌన్ లోడ్లను సొంతం చేసుకున్నది. పలువురు భారతీయలు ఇప్పటికే ఖాతాలు తెరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, సంస్థలు తమ ఖాతాలు ఓపెన్ చేసి అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ట్విటర్ కు, కేంద్రానికి మధ్య టూల్ కిట్ విషయంలో గొడవ జరుగుతున్నది. ఈ సమయంలో మైక్రో బ్లాగింగ్ కూ యాప్ 30 మిలియన్ల నిధులు సేకరించింది. అమెరికాకు చెందిన టైగర్ గ్లోబర్ పెట్టుబడి నిధుల కోసం నాయకత్వం వహించింది. దీంతో కూ యాప్ విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగి వంద మిలియన్ డాలర్లకు చేరుకున్నది. టాక్సీ ఫర్ ష్యూర్ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ కూ యాప్ ను డెవలప్ చేశారు. రానున్న కొద్ది రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద మైక్రో బ్లాగింగ్ యాప్ గా కూ అభివృద్ధి చెందుతుందని రాధాకృష్ణ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.