FbTelugu

రూ.20 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు

న్యూఢిల్లీ: ఇండియాలో వచ్చే ఏడాది (2022) ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ఎంజీ మోటార్స్ ప్రణాళికలు రూపొందించుకున్నది. ఇప్పటికే వాహనాల విక్రయంలో దూసుకున్న ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై నిమగ్నమైంది.

అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా రూ.20 లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్  వాహనాన్ని వచ్చే ఏడాది మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు. టాటా పవర్ తో కలిసి ఈ ఏడాది చివరికి 40 సూపర్ పవర్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్ చాబా తెలిపారు. ఈ కార్లలో ప్రధాన సమస్య బ్యాటరీ ఛార్జింగే. దీన్ని అధిగమించేందుకు 500 కిలోమీటర్ల వరకు పని చేసే విధంగా లిథియం అయాన్ బ్యాటరీని రూపొందించే పనిలో తలమునకలుగా ఉన్నామని రాజీవ్ ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.