FbTelugu

బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న మెట్రోమ్యాన్

తిరువనంతపురం: మెట్రో మ్యాన్ గా పేరొందిన మాజీ రైల్వే అధికారి శ్రీధరన్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని కేరళ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

ఈ నెల 21న రాష్ట్రంలో బీజేపీ విజయయాత్ర నిర్వహించనున్నదని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా ఆయన పార్టీలోకి చేరుతున్నారని ఆయన వివరించారు. శ్రీధరన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మెట్రో రైలు నిర్మాణం జరిగింది. నిర్ణీత గడువు కన్నా ముందే ఆయన ప్రాజెక్టు పూర్తి చేయడంతో మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా పేరు సంపాదించుకున్నారు. ఆయన దేశంలో సంక్లిష్టమైన రైల్వే ప్రాజెక్టులు చేపట్టి షెహబాష్ అనిపించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.