FbTelugu

జూన్ 1 నుంచి మెట్రో?

హైదరాబాద్: ఇప్పటికే ఆర్టీసీ సర్వీసులు, క్యాబ్ లు, ఆటోలకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం త్వరలోనే మెట్రో రైలు సర్వీస్ లకు అనుమతించే అవకాశాలు ఉన్నాయి.

కరోనా లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో నిలిచిపోయిన మెట్రో సర్వీసులు జూన్ ఒకటవ తేదీ తరువాత మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి. నగరంలో రాకపోకలకు మెట్రో రైలు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండడంతో సిటీ ఆర్టీసీ సర్వీసులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ లను పునరుద్దరించే సాహసం చేయలేదు.

ప్రైవేటు ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు వేచి చూసి, 1 నుంచి అనుమతించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

You might also like