FbTelugu

మెట్రో మ్యాన్ నోట ఇంత పెద్ద మాటా?

తిరువనంతపురం: ఢిల్లోలో అధునాతన సౌకర్యాలతో మెట్రో రైలు నిర్మాణం చేయించిన ఆయనను సౌమ్యుడిగా, మేధావిగా గుర్తిస్తారు. కాని ఆయన నోట వెలువడిన మాటలు సంచలనంగా మారాయి.
కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీధరన్ రైల్వే శాఖలో ఉన్నత పదవులను చేపట్టారు. దేశంలో ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనే మెట్రో మ్యాన్ శ్రీధరన్. నేడో రేపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో లవ్ జీహాదీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో లవ్ జిహాదీ కేసులు నమోదు అవుతున్నది వాస్తవమేనని, పెళ్లి కోసం ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలకు వల వేస్తున్నది కూడా నిజమేనని శ్రీధరన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో కూడా తనకు తెలుసునని అన్నారు.

హిందూ అమ్మాయిల కోసం ఎలా వల వేస్తారో తెలుసని, ఆ తరువాత అమ్మాయిలు ఎంత నరకయాతనకు గురవుతారనేది కూడా తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నానని అన్నారు. హిందువులే కాదు క్రిష్టియన్ అమ్మాయిలను కూడా ఇలానే మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లవ్ జీహాద్ కు తాను వ్యతిరేకమని శ్రీధరన్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.