FbTelugu

సిగ్నల్ వచ్చింది.. ఇక బేఫికర్!

మెస్సేజింగ్ సర్వీసు వాట్సప్ ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా, ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనలను అంగీకరించకపోతే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి పనిచేయదు.
దీంతో వాట్సప్ వినియోగదారులు మిగతా మెస్సెంజర్ యాప్ ల వైపు చూస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సిగ్నల్ యాప్ వాడాలంటూ సందేశమిచ్చారు. మస్క్ అలా సందేశమిచ్చారో లేదో మిలియన్ల కొద్ది దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అయితే పలువురు నేరుగా గూగుల్ ప్లే స్టోర్ బదులు సిగ్నల్ గ్రూప్ లింక్ ద్వారా చేరేందుకు ప్రయత్నించడంతో యాప్ లో కొంత సాకేంతిక లోపం ఏర్పడినట్లు సిగ్నల్ ట్వీట్ చేసింది. గ్రూప్ లింక్ ను ఉపయోగించి ఇర మెస్సెంజర్ యాప్ ల నుంచి సిగ్నల్ యాప్ కు ఏ విధంగా చేరుకోవాలో తెలియచేసే రూట్ మ్యాప్ ను సిగ్నల్ సంస్థ ప్రకటించింది.

వాట్సప్ యాప్ కొత్తగా తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్ బుక్ సంబంధిత సర్వీసులతో వినియోగదారుల డేటా పంచుకోవడం మెజారిటీ వినియోగదారులకు మింగుడు పడడం లేదు. వ్యక్తిగత సమాచారం, మొబైల్ ఇన్మర్మేషన్, ఐపీ అడ్రస్ తదితర వివరాలు ఫేస్ బుక్ తో వాట్సప్ షేర్ చేసుకోనుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇతర యాప్ ల వైపు మొగ్గు చూపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.