FbTelugu

శ్రీశైలం భక్తుల దాడిలో మెస్ ఇన్చార్జీ మృతి

కర్నూలు: శ్రీశైలం భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానం సన్నిధిలో దారుణం చోటు చేసుకున్నది. కాకతీయ కమ్మవారి కుల సత్రంలోని భక్తులకు, భోజనశాల సిబ్బందికి భోజనం విషయంలో గొడవ తలెత్తింది.

రెండు వర్గాల మధ్య దూషణలు పెరిగి పెద్దది అయ్యింది. నలుగురు భక్తులు మెస్ ఇన్చార్జీ బొడ్డు శ్రీను (55)ను విచక్షణా రహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసి భక్తులు అక్కడి నుంచి కొండ దిగి వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. పారిపోతున్న నలుగురు నిందితుల్లో ఇద్దరిని సున్నిపెంటలో అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని శ్రీశైలం ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.