FbTelugu

గీతాలాపనలో… కుర్చీలోనే మెర్కెల్

Merkel-did-not-wake-up-from-chair-when-national-anthen-singing-time

భారత పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారత జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఏంజెలా మెర్కెల్ కుర్చీలోంచి లేవకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జర్మనీ ఎంబసీ వివరణ ఇచ్చింది. మెర్కెల్ కు మోకాళ్ల సమస్య ఉందని, ఆమె ఒక్కసారిగా లేచి నిలబడే పరిస్థితిలో లేరని జర్మనీ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని తాము భారత రాష్ట్రపతి భవన్ వర్గాలకు ముందుగానే తెలియజేశామని స్పష్టం చేశారు.

You might also like