FbTelugu

గుట్టుగా రెండో పెళ్లి.. ఆపై హత్య

men-second-marrage-and-killed-her

గుట్టుగా రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. ఈ రెండో పెళ్లి వ్యవహారం ఎక్కడ మొదటి భార్యకు తెలుస్తుందోనని రెండో భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర గోండియా జిల్లాకు చెందిన తిలక్‌చంద్‌ సుందర్‌లాల్‌ లిహారే కి ఓ కూతురు కూడా ఉంది. మేస్త్రి పని చేసుకునే దిలీప్‌ తన వద్ద కూలి పనులకు వచ్చే మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ జిల్లాకు చెందిన సీమా దమాహే (22)తో ప్రేమ కొనసాగించాడు. తనకు పెళ్లయిన విషయం ఆమె వద్ద దాచి రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెతో కలిసి పనుల కోసం హైదరాబాద్‌ వచ్చేశాడు. వనస్థలిపురంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనంలో ఇద్దరూ పనికి కుదిరారు. కొన్నాళ్లయ్యాక సొంతూరుకు వెళ్దామని సీమ ఒత్తిడి చేయడంతో దిలీప్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. అక్కడికి వెళితే తనకు మొదట పెళ్లయి, కూతురు కూడా ఉందన్న విషయం బయటపడుతుందని ఈనెల 16న ఆమెను భవనం మూడో అంతస్తుకు నుంచి తోసేశాడు. కిందపడి తీవ్రంగా గాయపడిన సీమాను తోటి పనివాళ్లు ఆసుపత్రికి తరలించేలోగానే చనిపోయింది. అయితే చనిపోయే ముందు తన భర్తే తనను చంపాలని తోసేశాడని పనివాళ్లకు చెప్పడంతో వారు విషయం పోలీసుకు తెలిపడంతో అసలు నిజం బయటపడిందని తెలిపారు.

You might also like