FbTelugu

ఎంపి కే మస్కా కొట్టిన నకిలీ ఐఏఎస్

కొలకతా: దేశంలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు మరొకరి చేతిలో మోసపోతున్నారు. ఇప్పటి వరకు సాధారణ ప్రజలే మోసపోవడం చూశాం. కాని లక్షల మందితో ఎన్నుకోబడిన పార్లమెంటు మెంబర్ (ఎంపి) కూడా మోసపోవడం శోచనీయం.
ఒక వ్యక్తి తనకు తాను ఐఏఎస్ గా తృణముల్ పార్టీ ఎంపి మిమి చక్రవర్తిని పరిచయం చేసుకున్నాడు. ఆయన చుట్టూ సిబ్బంది కూడా ప్రభుత్వ అధికారుల మాదిరే కన్పించడంతో నిజమేనని నమ్మి బోల్తా పడింది.

ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఈ క్యాంప్ కు రావాల్సిందిగా ఆహ్వానించాడు. నిజమేనని నమ్మిన మిమి చక్రవర్తి అక్కడి వెళ్లి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నది. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఎంతకీ ఫస్ట్ డోస్ తీసుకున్నట్లు ఎస్ఎంఎస్ రాలేదు. మోసం జరిగిందని గ్రహించిన ఆమె కొలకతా పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయగా గుట్టు రట్టయింది. తనకు నకిలీ వ్యాక్సిన్ వేశారని బావురుమంది.
ఎంపి మిమి చక్రవర్తి ఫిర్యాదు మేరకు నకిలీ ఐఏఎస్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కారు, సైరన్ కు ఉపయోగించే నీలిరంగు బుగ్గను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.