FbTelugu

తేజూ హిట్ కోసం మెగాస్టార్?

తండ్రి.. మేన‌మామ ఇద్ద‌రూ ఒక్క‌టే అంటారు. అనుబంధాల విష‌యంలో ఇది సుస్ప‌ష్టం. తెలుగు సినీ రంగంలోనూ వార‌సుల బెడ‌ద ఎక్కువే. ఎవ‌రికి వారు త‌మ వారిని వెండితెర‌పై వెలిగిపోయేలా చూడాల‌నుకుంటారు.

స‌త్తా.. సామ‌ర్ధ్యం ఉన్న‌వారు మాత్ర‌మే నిల‌బ‌డ‌తార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. బాల‌య్య‌, నాగార్జున‌, జ‌గ‌ప‌తిబాబు, ప‌వ‌న‌క‌ళ్యాణ్ త‌దిత‌ర స్టార్ ల నుంచి రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్‌, సందీప్ కిష‌న్ వ‌ర‌కూ ఇలా సినీ కుటుంబాల నుంచి వ‌చ్చి స్వ‌యంశ‌క్తితో ఎదుగుతున్న‌వారే ఉన్నారు. వార‌సత్వం ఉన్నా.. ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించిన‌వాళ్లు ఎంచ‌క్కా బిజినెస్‌లు చేసుకుంటున్నారు. ఇంత‌కీ అస‌లు సంగ‌తి ఏమిటంటే… మెగా ఇంటి నుంచి వ‌చ్చిన వారిలో అల్లు శిరీష్, చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్‌దేవ్‌లు మాంచి హిట్ కోసం చూస్తున్నారు.

వీరితోపాటు వ‌రుస ప్లాప్‌ల‌తో ప్ర‌తిరోజూ పండుగేతో హిట్ కొట్టిన తేజూ కూడా ఇప్పుడిప్పుడే గాడిన ప‌డుతున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ సినిమా సంక్రాంతి వేళ క‌లెక్ష‌న్లు సాధించింది. ఆ సినిమా క‌థ విని… మార్పులు. చేర్పుల‌తో హిట్ వ‌ర‌కూ న‌డిపించింది మాత్రం మెగాస్టార్ కావ‌ట‌మే విశేషం. అందుకే.. వ‌రుస హిట్ కోసం తేజూ చేయ‌బోయే త‌రువాత సినిమాపై కూడా మెగాస్టార్ ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ట‌. దాదాపు నాలుగైదు క‌థ‌లు విని. ద‌ర్శ‌కుల‌కు మార్పులు కూడా సూచించార‌ట‌. వాటిలో ఏది త‌న‌కు న‌చ్చుతుందో.. హిట్ ఫార్ములా ఉంద‌ని భావిస్తారో.. దానినే ఫైన‌ల్ చేస్తార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే.. తేజూ వ‌రుస‌గా హిట్లు అందుకోవ‌టం ఖాయ‌మంటున్నారు మెగా అభిమానులు. ఎందుకంటే. మెగాస్టార్ జ‌డ్జిమెంట్ ప‌క్కాగా ఉంటుంద‌నేది సినీ పండితుల్లో ఉన్న న‌మ్మ‌కం.

You might also like