FbTelugu

మీకు నేను సెల్యూట్ చేస్తున్నాను: చిరంజీవి

* కూతురికి సెల్యూట్ చేసిన తండ్రి ఫొటోపై స్పందన
హైదరాబాద్: ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఓ ఫొటోపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా తిరుపతిలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో సీఐ శ్యాంసుందర్, తన కుమార్తె జెస్సీ ప్రశాంతి (గుంటూరు అర్బన్ (సౌత్) డీఎస్పీ)కి సెల్యూట్ చేయడం సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది.

దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. కన్న బిడ్డ, తన పైఅధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోల్డంత సంతృప్తిని, గర్వాన్ని, ప్రేమను చూశానని, శ్యాంసుందర్ గారికి తాను సెల్యూట్ చేస్తున్నానంటూ పేర్కొన్నారు. మీ ఇద్దరూ ఇంకెందరికో స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.