FbTelugu

ఇవ్వాళ, రేపు ప్రధాని సీఎంలతో భేటీ

ఢిల్లీ: ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ సమావేశం కానున్నారు.

చివరి సారిగా మే 11న ఆయన ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడమే కాకుండా మరణాలు సంభవిస్తున్నాయి. మున్ముందు మరింత్ర తీవ్రంగా పెరక్కుండా నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు.

ఇవాళ, రేపు ఆయన సీఎంలతో చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 21 రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో మోదీ చర్చిస్తారు. బుధవారం మరో 15 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారితో సమావేశం అవుతారు. ఇందులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఉన్నాయి.

You might also like