FbTelugu

భవిష్యత్ కార్యాచరణపై రైతుసంఘాల భేటీ

* 37వ రోజుకు చేరిన రైతు ఆందోళనలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు నేటికి 37వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు అనేక మార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

తాజాగా ఇవాళ రైతుల ఆందోళనలపై భవిష్యత్తు కార్యచరణకోసం మరో మారు రైతుసంఘాల నేతలు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. నూతన వ్యవసాయ చట్టాల్లో మార్పులు కాకుండా పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండడంతో కేంద్రం కూడా వెనక్కి తగ్గడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.