FbTelugu

మీ సేవ, ఈ సేవల్లో వ్యాక్సిన్ నమోదు

సందేహాలకు 1075 టోల్ ఫ్రీ నెంబర్
హైదరాబాద్: వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్రం ఇవాళ కూడా మరోసారి దేశ వ్యాప్తంగా డ్రై రన్ నిర్వహిస్తున్నది.

వ్యాక్సిన్ కోసం పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారం రోజులలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్రం రాష్ట్రాలను సన్నద్ధం చేస్తోంది. పేర్లు ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఎప్పుడు ఇస్తారు, ఏ నిబంధనలు ఉంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల పంపిణీ పై ఒక ముందడగు వేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీ.హెచ్.సీ), ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. 50 ఏళ్లు దాటిన వారు, 18 నుంచి 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రెండు విధానాలను అందుబాటులోకి తెచ్చారు.
మండల స్థాయిలో వైద్య అధికారి పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది నమోదు ప్రక్రియను చేపడతారు. ఈ రెండు వర్గాల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. బర్త్ సర్టిఫికేట్, ఓటరు కార్డు, పాస్ పోర్టు లేదా మరే ఇతర అధికార ధృవపత్రం తీసుకువెళ్తే కొవిన్ వెబ్ యాప్ లో సమాచారాన్ని పొందుపరుస్తారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అనారోగ్యాన్ని ధృవరుస్తూ వైద్యులు ఇచ్చిన చీటిని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 1075 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలియచేయాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.