FbTelugu

మెడిసిన్ విద్యార్థిని‌ ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలో మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ కు చెందిన ఝాన్సీ అనే యువతి నగరంలోని బేగంపేటలో ఉంటూ.. గాంధీ ఆసుపత్రి కళాశాలలో మెడిసిన్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

తానుంటున్న నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గత కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యుకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.