FbTelugu

అక్రమంగా కరోనా రోగుల మెడిసిన్ అమ్మకాలు

హైదరాబాద్: ఓ పక్క కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుండగా.. ఇంతటి కష్టకాలంలోనూ కొందరు కరోనా రోగులకు అందాల్సిన మందులను పక్కదారి మల్లిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొందరు సిబ్బంది రోగులకు ఇవ్వాల్సిన మందులను చోరీ చేసి అక్రమంగా అమ్ముకుంటున్నట్టు గుర్తించారు.

కరోనా పేషెంట్ కు ఇవ్వాల్సిన డ్రగ్స్ లో రెండింటినే వాడి మిగతావి కొట్టేస్తున్నారు. ట్రీట్ మెంట్ మధ్యలోనే మృతి చెందిన కరోనా రోగుల మందులను కూడా బహిరంగ మార్కెట్ లో రూ.5 వేల డ్రగ్ ను రూ.30 వేలకు అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని 6 ప్రైవేటు ఆస్పత్రుల్లో సిబ్బంది ఇలా చేతివాటం చూపిస్తున్నట్టు గుర్తించారు.

You might also like