FbTelugu

మేడారంలో మినీ జాతర షురూ

ములుగు: గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క-సారాలమ్మల మినీ జాతర ప్రారంభమైంది. వన దేవతలకు 27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పూజలు జరగనున్నాయి. లక్షలాది మంది మొక్కులు సమర్పించుకోనున్నారు.
మహా జాతర తరహాలో తల్లులను గద్దె పైకి తీసుకు రానప్పటికీ పూజా సామగ్రితో పాటు గిరిజన సంప్రదాయ పద్దతిలో మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారంలో సమ్మక్క-సారాలమ్మ మహా జాతర నిర్వహిస్తారు. మరుసటి సంవత్సరం మినీ జాతర జరగడం సంప్రదాయంగా వస్తున్నది.

మినీ జాతకు కనీసం 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని కమిటీ సభ్యులు అంచనా వేశారు. ఎండలు మొదలు కావడంతో గద్దెల ప్రాంతంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకోనున్నారు. కనీస సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.1.52 లక్షలు ఖర్చు చేసింది. శనివారం ఆయా ఆలయాల నుంచి తీసుకువచ్చిన పూజా సామగ్రిని తిరిగి తీసుకువెళ్లడంతో మినీ జాతర ముగియనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.